కావాలనే రైతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు- మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

116

THE BULLET NEWS (SARVAPALLI) -అభివృద్ధిని చూడలేక కొందరు అడ్డుకుంటున్నారు.. రైతుల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. వారి కుట్రలను అందరూ తిప్పికొట్టండి అంటూ ఏపీ వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.. ఇవాళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని కండలేరు ఎడమ కాలువ పరిధిలో మంత్రి
సోమిరెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. పంటల పరిశీలన, నీటి
విడుదల క్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమన్వయంతో ముందుకు సాగి నీటి
యాజమాన్యం పాటించాలని రైతులకు సూచించారు.. ఈ సందర్బంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ
అక్రమంగా నీరు తరలించినా, పారుదలను అడ్డుకున్నా కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు
ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నీరు అందించాలని ఇరిగేషన్ అధికారులకు
సూచనలిచ్చానన్నారు. మెట్ట ప్రాంతమైన పొదలకూరు మండలంలోని పొలాలు కండలేరు ఎడమకాలువ
జలాలతో సస్యశామలం కావడం తనకు సంతోషంగా ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు
భారీగా పాల్గొన్నారు..

SHARE