నెల్లూరు జడ్పీ మీటింగ్ లో మంత్రి వర్సెస్ కాకాణి

121

The bullet news (Nellore)- జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అధ్యక్షతను జరిగిన ఈ సమావేశంలో అజెండాలో పదకొండో అంశంగా ఉన్న జలవనరుల శాఖ సమీక్షలో చర్చ మొదలు కాగానే సర్వేపల్లి నియోజకవర్గంలోని కనుపూరు కాలువ ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి పలు సందేహాలను లేవనెత్తారు.. అజెండా నోట్ లో ఇచ్చిన ప్రకారం కనుపూరు కాలువలు పూర్తైనట్లు ఉండగా, 30 శాతం పనులు కూడా జరిగలేదనే విషయాన్ని తాము గుర్తించామన్నారు. దీనికి సెంట్రల్ డివిజన్ ఈఈ క్రుష్ణమోహన్ సమాధామనిస్తూ అందులో పొరపాట్లు జరిగాయని వాటిని సర్దుదిద్దుతామన్నారు. పనులు చేయకుండానే బిల్లులు ఎలా చేల్లిస్తారంటూ ఆయన నిలదీశారు. దీనిపై మంత్రి సోమిరెడ్డి స్పందిస్తూ జిల్లాలో తొలిసారిగా కావలి, కనుపూరు కాల్వల పరిధిలో 7 లక్షల ఎకరాలకు తాగునీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెబుతుండగా దాన్ని కాకాని అడ్డుకున్నారు.. తాను కనుపూరు కాల్వ ఎత్తిపోతల పథకాలల్లో అవినీతిపై ప్రశ్నిస్తే దానికి మీ సమాధానమేంటంటూ మంత్రిని నిలదీశారు. దీంతో వారిద్దరి మద్యవాగ్వాదం చోటు చేసుకుంది. అవినీతితో ప్రజాధనాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమని మంత్రిని ఉద్దేశిస్తూ కాకాణి హెచ్చరించారు. దీంతో నువ్వేంటి మాట్లాడేదంటూ మంత్రి సోమిరెడ్డి కాకాణిని ప్రశ్నించారు. దీనికి అంతే స్తాయిలో కాకాణి కూడా ప్రతి స్పందించారు. ఈ సందర్బంగా ఒకరినొకరు నువ్వెంత నువ్వేంతా అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయి విమర్వలు, వ్యక్తిగత దూషణలకు దిగారు.. ఒకరికి ఒకరు ఊగిపోతూ ఆగ్రహించుకున్నారు.. సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య వివాదం తలెత్తడంతో సమావేశాన్ని వాయిదా వేయాలని మంత్రి జడ్పీ చైర్మన్ ను కోరడంతో సభ అర్దాంతంగా వాయిదా పడింది..

SHARE