నెల్లూరు జిల్లాలో ఆగని అత్యాచారాలు..

139

THE BULLET NEWS (NAIDUPETA)-మహిళలను, చిన్నారులను బాధ్యతగా సంరక్షించాల్సిన వారే వారిపై విరుచుకు పడుతున్నారు.. వయసు తారతమ్యాలు, వావి వరసలు మరిచి ముక్కుపచ్చలారని చిన్నారుల పై వికృత చేష్టలకు తెగబడుతున్నారు.. చట్టాలు, కోర్టులు సరిగా లేకపోవడంతో మృగాళ్లకు భయం లేకుండా పోతుంది..నెల్లూరు జిల్లాలో చిన్నారులపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.. నాయుడు పేటలో ఐదేళ్ల చిన్నారి పై గురుస్వామి అనే వృద్ధుడు అత్యాచారనికి యత్నించాడు..బిస్కట్స్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యంకి పాల్పడబోయాడు. చిన్నారి నానమ్మ గమనించడంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. చిన్నారి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

SHARE