బాల నేరస్థులు అరెస్ట్…

36

THE BULLET NEWS (NELLORE) – అర్దరాత్రులు ఒంటరిగా సంచరిస్తున్నవారిపై దాడులకు పాల్పడుతూ నగలు, నగదును దోచుకెళ్తున్న 10 మందిని నెల్లూరు టుటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5లక్షఁలు విలువ చేసే 7 బైకులు, నగదు స్వాదీనం చేసుకున్నారు.. అరెస్టైన వారిలో 8 మంది బాలనేరస్తులున్నారు..

నగరంలోని బాలాజీనగర్, కిసాన్ నగర్, బీవీనగర్ , ఎన్టీయార్ నగర్, బోడీగాడితోట పరిసరా ప్రాంతాలకు చెందిన 8 మంది బాలనేరస్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు.. ఈజీగా మనీ సంపాదించాలనే లక్ష్యంతో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు.. అర్దరాత్రులు సంచరిస్తూ ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వ్రుద్దులు, దంపతులను టార్గెట్ గా చేసుకుని వారిపై దాడులు చేసేవారు.. వారిని భయబ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉండే నగలు, నగదు దోచుకెళ్లెవారు.. ఇలాంటి కేసులపై ద్రుష్టి సారించిన నెల్లూరు టు టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు..

SHARE