రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే దుర్మరణం…

79

THE BULLET NEWS (KARNATAKA)-కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సిద్ధు భీమప్ప న్యామగౌడ్‌ దుర్మరణం పాలయ్యారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఇవాళ తెల్లవారుజామున గోవా నుంచి బాగల్‌కోటకు కారులో వస్తుండగా తుల్సిగిరి వద్ద లారీ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో న్యామగౌడ్‌ మరణించారు. జామకండి నియోజకవర్గం నుంచి న్యామ గౌడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కులకర్ణి శ్రీకాంత్‌పై 2795 ఓట్ల తేడాతో విజయం సాధించారు

SHARE