మంత్రికి.. ఆయన కేసులకు భయపడను – ఎమ్మెల్యే కాకని

73

The Bullet News – Nellore

మంత్రి సోమిరెడ్డి నా మీద తప్పుడు కేసులు పెట్టించి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు..సోమిరెడ్డి లాంటి వాళ్ళకి, వాళ్ళు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.. న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని ఎమ్మెల్యే కాకని స్పష్టం చేశారు.. మంత్రిసోమిరెడ్డి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు.. సోమిరెడ్డి లాంటి వాళ్ళని రాజకీయాల్లో ఎన్నడూ చూడలేదన్నారు..
తాను అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయమంటే తోక ముడిచి పారిపోయిన వ్యక్తి సోమిరెడ్డి అని కాకని విమర్శించారు. సోమిరెడ్డి కి వారసత్వంగా సంక్రమించింన ఆస్తి ఎంత..? సోమిరెడ్డి సంపాదన ఎంత..? రాజకీయాల్లో అవినీతి సంపాదన ఎంత..? విదేశాల్లో దాచినది ఎంత.? ఇవన్నీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి అవినీతికి పాల్పడి సంపాదించడం, కుమారుడు దేశ విదేశాల్లో దాచిపెట్టడంలో ప్రావీణ్యులని ఆయన వ్యాఖ్యానించారు..సోమిరెడ్డి కుమారుడు 9 కంపెనీలు స్థాపించడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు..
సోమిరెడ్డి అవినీతి సొమ్ముపై, నా పోరాటం కొనసాగుతుందని కాకని స్పష్టం చేశారు..
నకిలీ ఎరువులు, అవినీతి సంపాదనకు అలవాటు పడిన సోమిరెడ్డి వ్యక్తి మంత్రిగా ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అన్నారు.

 

SHARE