చంద్రబాబు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలి – ఎమ్మెల్యే కాకాణి

18
????????????????????????????????????

The bullet news (Nellore)- ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్ కోసం మా ఐదుమంది ఎంపీలు డిల్లీలో పోరాడుతున్నారని నెల్లూరుజిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు.. మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేకహోదాయే లక్ష్యంగా వైసీపీ చేస్తున్న పోరాటం చివరిదశకు చేరుకుందన్నారు. మద్దతు కోసమంటూ చంద్రబాబు నాయుడు డిల్లీకి వెళ్తే ఆయన మొఖం చూసేందుకు కూడా
జాతీయస్తాయి నాయకులు ఇష్టపడలేదన్నారు. బాబు అవకాశవాదనే విషయంగా
జాతీయనాయకులకు సైతం అర్దమైందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ది తెచ్చుకుని తమ ఎంపీల చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.. హోదాపై చిత్తశుద్దుంటే మా పార్టీలతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు వెంకట శేషయ్య,శివప్రసాద్, నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి , తులసీయాదవ్ పాల్గొన్నారు..

SHARE