క‌లెక్ట‌ర్ పై ఎమ్మెల్యే కాకాణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

283

The bullet news (Nellore)_ నెల్లూరుజిల్లా కలెక్టర్ ముత్యాలరాజుపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లాలో అవినీతి అక్రమాలు తీవ్రస్థాయిలో జరుగుతుంటే కలెక్టర్ అవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. మరుగుదొడ్ల కుంభ‌కోణం, నీరు-చెట్టు లో అవినీతి తీవ్ర స్తాయిలో ఉన్నా.. కలెక్టర్ మంత్రులకు పర్సనల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్ర‌జ‌ల‌కు స‌ర్వీస్ చేయ‌డంలేద‌ని ఆరోపించారు.. సివిల్ సర్వీస్ మీద, క‌లెక్ట‌ర్ మీద‌ తనకు గౌరవం ఉందన్న కాకాణి.. కలెక్టర్ ముత్యాలరాజు పద్దతి మార్చుకోని పేదలపక్షాన నిలవాలని కోరారు..

SHARE