వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీలో ప్ర‌స్తావించిన ఎమ్మెల్యే కురుగొండ్ల‌

213

The bullet news (Amaravathi)- వెంకటగిరి నియెాజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ అసెంబ్లీలో ప్ర‌స్తావించారు.. ముఖ్యంగా బాలాయపల్లి మండలం చిలమనూరు గ్రామ చెరువును రిజర్వాయర్ గా మార్చాల్సిన అవ‌శ్య‌క‌త‌ను ఆయ‌న వివ‌రించారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ చిల‌మ‌నూరు గ్రామ చెరువును రిజ‌ర్వాయ‌ర్ గా మార్చ‌డం ద్వారా దాని చుట్టు ప‌క్క‌ల ఉండే దాదాపు 9 గ్రామాల కింద‌నున్న 3400 ఎకరాలకు సాగునీరు అందించొచ్చ‌న్నారు.. ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం కోసం రైతులు ఎదురుచూస్తున్నార‌న్నారు.. ఆ చెరువ‌ను రిజ‌ర్వాయ‌ర్ గా మార్చాలంటే తెలుగుగంగ ప్ర‌ధాన కాలువ 54 వ కిలోమీట‌ర్ల వ‌ద్ద ఫ్ట్ ఏర్పాటు చేయ్యాలని త‌ద్వారా ఆ లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించొచ్చ‌న్నారు.. దాంతో పాటు ఉపాధి లేక వ‌ల‌స‌లు వెళ్తున్న కుటుంబాల‌కు ఉపాధి దొర‌కుతుంద‌న్నారు.. ఈ స‌మ‌స్య‌ను అసెంబ్లీలో ప్ర‌స్తావించడంతో ఆ ప్రాంత రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు..

SHARE