ఉర్దూ పాఠశాలలో ఎమ్మెల్యే పోలంరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన కొడవలూరు మైనారిటీ నాయకులు

101

THE BULLET NEWS (KODAVALUR):- కొడవలూరు మండలం యల్లాయపాలెం గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో కోవూరు శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి జన్మదినం సందర్భంగా టీడీపీ మైనార్టీ నాయకులు ఎస్డీ ఖలీల్ బాషా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .కేక్ కట్ చేసి విద్యార్థులకు అందజేశారు అనంతరం ఒకరికొకరు తినిపించుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు ,బాక్సులు ,పెన్నులు వచ్చిలు ,పంపిణి చేసారు బోడుగు శ్రీనివాసులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పాదంలో నడిపిస్తూ పేద బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతిగా వెలుగొందుతున్న మా అన్న ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్ రెడ్డి ,బోడుగు శ్రీనివాసులు ,రమేష్ , పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు .

SHARE