కోవూరు వైసీపీ లో జోష్ తెచ్చిన రోజా పాదయాత్ర…

223

THE BULLET NEWS (KOVUR):-వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 3000వేల కిలోమీటర్ల దాటిన సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు సంగిభావా పాదయాత్ర ఏర్పాటు చేశారు. ముక్య అతిథిగా వచ్చిన రోజాకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రోజా తమ జిల్లాలోకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో కోవూరు జనసంద్రమైంది.వేలాదిగా తరలివచ్చిన జనవాహిని మధ్య రోజా అభివాదం చేస్తూ అడుగులు వేశారు. తమ అభిమాన నాయకురాలు రోజాను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలిరావడంతో కోవూరులో పండగ వాతావరణం కనిపించింది.

SHARE