‘నిరుపేద’ ఎమ్మెల్యే..

99

The Bullet news – Political

ఎమ్మెల్యే.. ఇదో పెద్ద ‘పదవి’. ఆ హోదా.. ఆ దర్పం.. ఆ లెక్కే వేరు. వారి ఆదాయం కూడా కోట్లల్లోనే..! శాసనసభ్యుల గురించి సాధారణంగా అందరూ ఇలానే అనుకుంటారు. ఎమ్మెల్యేగా ఎన్నికవాలంటే కోట్లాది రూపాయలు కుమ్మరించాలనేది బహిరంగ రహస్యం. అందుకే.. ఎమ్మెల్యేగా ఎన్నికైనవారంతా కోట్లకు పడగలెత్తినవారేనని అంతా భావిస్తుంటారు. కానీ అత్యల్ప ఆదాయం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంతపురం ఎమ్మెల్యే యామినీబాల (టీడీపీ) వార్షికాదాయం కేవలం 1301 రూపాయలు. ఎమ్మెల్యగా తీసుకుంటున్న జీతభత్యాలు కాకుండా ఆమె ఏడాది సంపాదన ఇదే. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ దేశవ్యాప్తంగా 3,145 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గత ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఆ వివరాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం వార్షికాదాయంలో అట్టడుగన యామినీబాల ఉన్నారు. అత్యల్ప ఆదాయం ఉన్న టాప్‌ 20 ఎమ్మెల్యేలలో యామినీబాల మొదటి స్థానంలో ఉండగా.. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌అప్పారావు (వైసీపీ) రూ.60,000 వార్షికాదాయంతో 16వ స్థానంలో ఉన్నారు.

SHARE