స్వయంగా మోడీ అడిగినా నా ఓటు జగన్ కే….

81

The bullet news(posani)- వర్మ తర్వాత ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. సంచలనాలు సృష్టించే వ్యక్తి పోసాని కృష్ణ మురళి.. తాజాగా రాజకీయాలపై.. జగన్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలిచిన పోసాని.. ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన కు అండగా నిలుస్తారా అని అడిగిన ప్రశ్నకు పోసాని షాకింగ్ సమాధానం చెప్పారు.
నా దగ్గరకు స్వయంగా ప్రధాని మోడీ వచ్చి.. రాజా.. పోసాని.. నీకు రాజ్యసభ సీటు ఇస్తా.. మా పార్టీకి ప్రచారం చేయి అని అడిగినా నేను వారి పార్టీకి ప్రచారం చేయను… నాకు ఎవరు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా.. ఎంతగా ప్రలోభ పెట్టినా తన ఓటు జగన్ కే అని.. తాను జగన్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని చెప్పాడు.. తాను ఒక నిర్ణయం తీసుకొన్న తర్వాత ఆ నిర్ణయం తిరిగి మార్చుకొనని.. తన వ్యక్తిత్వం అటువంటిది అని పోసాని చెప్పారు. తనకు పదవి.. అధికారం అవసరం లేదని ఒకవేళ తాను మాట మరుస్తా అని భావిస్తే.. ఈ ఇంటర్వ్యూ రికార్డ్ చేసి పెట్టుకోమని ఆయన చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా నా సపోర్ట్ జగన్ కే అని పోసాని చెప్పారు.

SHARE