బేటీ బచావో .. మోడీ హటావో

91

THE BULLET NEWS (KOVUR)-కథువాలో చిన్నారి ఆసీఫాను అత్యాచారం చేసి హత్యచేసిన మానవ మృగాలను ఉరితీయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.  చిన్నారి ఆసీఫాను హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద నుంచి బజార్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా సుకేష్ రెడ్డి మాట్లాడుతూ పసిప్రాణాన్ని  చిత్రవధలకు గురిచేసి నిర్ధాక్షిణ్యంగా చంపేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన మానవ మృగాలను క్షమించకూడదు వారిని కటినంగా శిక్షించాలి అన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు డి.సాయి ధీరజ్ రెడ్డి, కె.సుకేష్ రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు ఎమ్.నవీన్ కుమార్, వై. భావేష్ రెడ్డి మరియు కోవూరు లోని యువత పాల్గొన్నారు.

SHARE