సొమ్ము కేంద్రానిది సోకు చంద్రబాబుది-నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

103

THE BULLET NEWS (KODAVALUR)-నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం దక్షిణ హరిజనవాడ లో రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డ్డి మాట్లాడుతూ సొమ్ము కేంద్రానిది సోకు చంద్రబాబుది. కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన లక్షా ఇరవైఏడు వేల కోట్ల నిధులను చంద్రబాబు నాయుడు ప్రక్క దారి పట్టిస్తున్నాడని బీజేపీ ఎమ్.ల్.సి సోము వీర్రాజు మాట్లాడడం మంచి పరిణామం. లక్షా కోట్లతో నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం ఐదు వేల కోట్ల రూపాయలతో విద్యుతీకరణ పనులు మున్సిపాలిటీలలో, పంచాయతీలలో ఎల్.ఈ.డి వీధి దీపాలు ఏర్పాటువంటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు లాంటి కార్యమాలతో వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాణిలోకి ఇస్తుంటే చంద్రబాబు మరియు అతని సహచర మంత్రులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు సరిగా ఇవ్వడం లేదు అనడం చాలా బాధాకరమైన విషయం. బీజేపీ ఎమ్.ల్.సి గారు చెప్పిన దాని మీద చంద్రబాబు వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ నిధులను చంద్రబాబు నాయుడు నిజాయితీగా ఖర్చు పెట్టి ఉంటె ఇంత వరకు లెక్కలు దాటవేత ధోరణి అవలంబించటం ఎందుకు. తన తప్పులను అవినీతిని కప్పి పుచ్చుకోవటానికి కేంద్రం పై సాకులు చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా యాభై మంది మహిళలు వారితో పాటుగా పురుషులు చేరడం ఆనందకరం.

SHARE