అమ్మ‌కు ఒక్క‌రోజు మాత్ర‌మే కాదు.. రోజూ పాదాభివంద‌నం చేయాలి – ఎమ్మెల్యే పోలంరెడ్డి

136

The bullet news (Kovuru)_ సృష్టికి మూల‌మైన అమ్మ‌కు ఒక్క‌రోజే కాద‌ని ప్ర‌తి రోజూ వంద‌నం చేయాల‌ని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు.. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన అమ్మ‌కు వంద‌నం కార్య‌క్ర‌మం కొడవలూరు ప్రభుత్వ పాఠశాలలో నిర్వ‌హించారు.. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. వసంత పంచమి ప‌ర్వ‌దినాన్ని అమ్మకు వందనం రోజు గా మార్చి తల్లి గొప్పతనం గురుంచి పిల్లలు కి తెలియ‌జేయ‌డం గొప్ప కార్య‌క్ర‌మ‌మ‌న్నారు.. మర్చి పోతున్న సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంద‌న్నారు.. త‌ల్లే బిడ్డ‌కు తొలిగురువ‌ని, అలాంటి త‌ల్లిని ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు.. ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి అమ్మ గొప్ప‌ద‌నం తెలియ‌జేసేందుకు ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు ప్ర‌వేశ‌పెట్టార‌న్నారు.. అనంత‌రం విద్యార్థులు చేత వారి తల్లుల కు పాదాభివందనం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

SHARE