ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఎంపీ సెటైర్లు..

86

The bullet news (Nellore)_చేసిన తప్పులను పాపాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా కోసం పోరాటడం లేదని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.. రాజీనామాలు, ఆమరణ దీక్ష అనంరతం మొదటి సారి నెల్లూరొచ్చిన ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా ప్రాణవాయువు లాంటిదన్నారు.11 రాష్ట్రాలు అనుభవిస్తున్న హోదాను ఏపీకి కల్పించి ఆదుకోవాలని డిమాండ్ తోనే పోరాటం స్తున్నామన్నారు.. ఏపీని చీల్చడంలో బిజెపి పాత్ర కూడా ఉందన్న ఆయన హోదా ఇవ్వకపోవడంలో మోడీ ప్రదాన ముద్దాయి అయితే చంద్రబాబు రెండో ముద్దాయన్నారు. మోడీ గ్రాఫ్ తగ్గుతుందనే చంద్రబాబు బిజెపి దూరమయ్యారన్నారు. 2019 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అవ్వొచ్చన్న ఆయన 20 ఎంపీ స్థానాలు గెలిపించాలని ఆయన కోరారు.

SHARE