THE BULLET NEWS (KAVALI) -ఎమ్మార్వో ప్రయాణిస్తున్న కారు ఢీ కొని ఓ బైకిస్ట్ కు తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ఘటన జలదంకి మండలం చిన్నకాక వద్ద చోటు చేసుకుంది.. వివరాలోకెల్తే వింజ‌మూరు గిరిజ‌న కాల‌నీకి చెందిన మ‌ల్యాద్రి బైక్ లో జలదంకి వస్తున్నారు.. అదే సమయంలో కావ‌లి ఆర్డీవో కార్యాలయంలో పనులు ముగించుకున్న ఎమ్మార్వో జనార్దన్ కలిగిరి వెళ్తున్నాడు.. వీరిద్దరకు చిన్నకాక వద్దకు రాగానే బైక్ ను కారు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో మాల్యాద్రికి తీవ్రగాయాలయ్యాయి.. దీంతో అతన్ని హుటాహుటిన కావలి ఏరియా హాస్పటల్ కు తరలించారు.. మెరుగైన చికిత్స కోసం ఓ ప్రయివేట్ హాస్పటల్ కు తరలించారు.. ఎమ్మార్వో వాడుతున్న ప్రయివేట్ వాహనం బైక్ ను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు..

SHARE