అవినీతిని అడ్డుకుంటున్నామనే మా పై బురద చల్లుతున్నారు – ఎమ్మెల్యే కాకాని..

77

THE BULLET NEWS (NELLORE)-అధికార మదంతో.. తమకు ఎదురులేదన్న ధీమాతో టిడిపి నేతలు ఉపాధి హామీ పనుల్లో చేస్తున్న అవినీతిని బాధ్యత కల్గిన ప్రతిపక్షంగా తాము
అడ్డుకుంటే.. వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చెయ్యడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు..నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు.. ఉపాధి హామీ నిధులు నిలిపెయ్యాలంటూ స్వయంగా చంద్రబాబే కేంద్రానికి లేఖ రాసారని ఆయన ఆరోపించారు..ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం ఇప్పటికి కూడా సరైన సమాధానం ఇవ్వలేకుందన్నారు..కేంద్రం నిధులు నిలిపేస్తే వైసీపీ మీద బురద చల్లే ప్రయత్నం చెయ్యడం సరైన పద్ధతి కాదన్నారు.. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని బాధ్యత కల్గిన ప్రతిపక్షంగా బయటపెట్టమన్నారు. కాగ్ నివేదిక ప్రకారం 950 గ్రామాల్లో 146 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు.. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆపేందుకు వైఎస్సార్ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి సమర్థవంతంగా అమలు చేస్తే దాన్ని అడ్డుకునేందుకు అప్పట్లో చంద్రబాబు అనేక కుయుక్తులు పన్నారన్నారు. నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో కమిషన్స్ కోసం మూడో యూనిట్ తీసుకొస్తున్న దరిద్ర్యమైన చరిత్ర చంద్రబాబుదంటూ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు..

SHARE