THE BULLET NEWS (BUCHIREDDYPALEM)-కొందరి అజ్ఝానాన్ని ఆసరాగా చేసుకున్నాడు.. సామాన్యుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నాడు.. లో్న్లు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు.. ఆదార్ కార్డులు, బ్యాంకు బుక్స్
తీసుకుని బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యాడు.. లక్షల రూపాయాలు తీసుకుని ఎస్కేప్ అయ్యాడు.. నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ముద్రలోన్ ముసుగులో లక్షలు కాజేశాడు..

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి.. ఇతని పేరు ఆవుల వెంకటేశ్వర్లు.. మంచి మాటకారి.. ఐదు నిమిషాలు ఈ చీటర్ తో మాట్లాడితే చాలు.. ఎంతటి వారినైనా ఇట్టే నమ్మిస్తాడు.. ఆయన మాయమాటలకు మోసపోయారు నెల్లూరు, బుచ్చి ప్రాంతాలను చెందిన కొందరు బాధితులు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర లోన్ లను ఇప్పిస్తానంటూ ఆవుల వెంకటేశ్వర్లు బుచ్చికి చెందిన కొందరికి మాయమాటలు చెప్పాడు.. అతని మాటలు నమ్మిన బాధితులు అతనికి ఆదార్ కార్డు, బ్యాంకు పుస్తకాలు
అతని చేతిలో పెట్టేశారు..

బ్యాంకు అధికారులతో కుమ్మక్పైన చీటర్ వెంకటేశ్వర్లు దాదాపు రూ.50లక్షల దాకా లోన్లు తీసుకున్నాడు.. బాధితుల అందరి పేర్ల మీద డబ్బులు తీసుకున్నాడు.. బ్యాంకు ఉద్యోగులు స్థానాల్లో కొత్తవారు రావడంతో బాధితులకు లోన్ కు సంబంధించిన బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపారు.. దీంతో అవాక్కైన బాధితులు బుచ్చి పోలీసులను అశ్రయించారు..

బుచ్చి ఎస్ఐ విచారణ చేపట్టడంతో ఆవుల వెంకటేశ్వర్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. సామాన్యులను అడ్డుపెట్టుకుని దాదాపు 50 లక్షల మేర బ్యాంకుల కుచ్చుటోపి పెట్టాడని విచారణలో తేలడంతో ఎస్కేప్ కు యత్నిస్తున్న వెంకటేశ్వర్లును వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద బుచ్చి పోలీసులు అరెస్టు చేశారు..

SHARE