ఏపీ థియేటర్స్ లలో బయటి ఫుడ్ కు అనుమతి…

109

THE BULLET NEWS (VIJAYAWADA)-విజయవాడ వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. బయటి నుంచి తెచ్చే ఫుడ్ ను షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ లలో అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు వినియోగదారుల ఫోరం జడ్జి మాధవరావు ఆదేశాలు జారీ చేశారు. మల్టిప్లెక్స్ ధియేటర్లలలో అధిక ధరల విక్రయాపై వినియోగదారులు ఫోరంను ఆశ్రయించారు. మార్గదర్శక సమితి సహకారంతో గత ఏడాది ఏప్రిల్ లో ఫోరంలో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న తర్వాత జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు తీర్పు వెల్లడించారు. సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ఆయన తెలుగులో తీర్పును ఇచ్చారు.

ఎల్‌ఈపీఎల్, ట్రెండ్ సెట్, పీవీఆర్‌, పీవీపీ, ఐనాక్స్ మల్టీప్లెక్స్‌పై చర్యలు తీసుకోవాలని జడ్జి మాధవరావు అధికారులను ఆదేశించారు. తినుబండారాలు, శీతల పానియాలను అధిక ధరలకు విక్రయించడంపై భారీ జరిమానా విధించారు. వినియోగదారులకు నష్టం కల్గించినందుకు 5లక్షల జరిమానా విధించారు. ప్రజలు బయట నుంచి తెచ్చుకునే ఆహారపదార్థాలు, తాగునీటికి అనుమతి ఇవ్వాలని తెలిపారు. ఆదేశాలు తప్పక అమలు చేయాలని అధికారులకు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల అమలు, పర్యవేక్షణ బాధ్యతను తూనికల కొలతల శాఖకు అప్పగించారు.

SHARE