థాంక్యూ మేయర్ అబ్దుల్ అజీజ్ సాబ్ – సన్మానించిన పారిశుధ్య కార్మికులు

96

The Bullet News – NELLORE

జీఓ నంబర్ 279కి వ్యతిరేకంగా గత 45 రోజులుగా నగరంలో సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులు సమ్మె విరమించారు.. మేయర్ అబ్దుల్ అజీజ్ కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపారు.. జీఓ లో కొన్ని మార్పులు చేసి కార్మికులకు ఇబ్బంది రాకుండా జీఓ నంబర్ 279ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని మేయర్ హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు..మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కార్మికుల ఉద్యోగ, వేతన భద్రతలను దృష్టిలో ఉంచుకుని 279 జీవోలో చిన్నపాటి మార్పులు చేసి అమలు చేస్తున్నామనీ, రాతపూర్వకంగా ఆయా ఉత్తర్వులను కార్మిక సంఘాల నాయకులకు మేయర్ హామీ ఇచ్చారు.. కార్మికులందరికీ నేరుగా కార్పోరేషను నుంచే నెలవారీ జీతాలూ, ఇతర అదనపు సదుపాయాలను కల్పిస్తూ, జీవో పరిధిలోకి తీసుకొస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు.. దీనితో కార్మికులు మేయర్ అబ్దుల్ అజిజి కి కృతజ్ఞతలు తెలిపి సన్మానం చేశారు..

SHARE