కోవూరులో దారుణహత్య…

115

THE BULLET NEWS (KOVUR)- నెల్లూరుజిల్లా కోవూరుకు చెందిన వాకాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.. శ్రీకాళహాస్తికి చెందిన వెంకటేశ్వర్లు (30) కోవూరులోని తన బంధువుల ఇంటిలో ఉంటూ కూలిపనులకు వెళ్లేవాడు.. ఆదివారం రాత్రి మద్యం తాగి నిద్రిస్తుండగా వెంకటేశ్వర్లు స్నేహితులైన అయ్యప్ప, సాయి, స్వరూపులు మద్యం తాగుదాం రమ్మంటూ తీసుకెళ్లి హత్య చేశారని మ్రుతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కూలి డబ్బుల దగ్గర వెంకటేష్ కు , అతని స్నేహితులకు మధ్య గొడవ జరిగిందని, అందులో భాగంగానే కోవూరు సమపంలోని ఎన్టీఎస్ వద్దునున్న తలపై మోది చంపేశారని వెంకటేష్ బందువులు ఆరోపిస్తున్నారు. వెంకటేష్ మ్రుతికి కారణమైన వారికి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. కేసు నమోదు చేసిన కోవూరు, రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు..

SHARE