ఉప్పు రైతులు ఆందోళన…

151

THE BULLET NEWS (MUTHUKUR)-కిష్ణపట్నం పోర్టు అభివ్రుద్దికి తాము సహకరిస్తున్నా తమ భూముల్లో పెన్నా సిమెంట్ ప్యాక్టరీని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ నెల్లూరుజిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురం ఉప్పు రైతులు ఆందోళన బాట పట్టారు.. పెన్నా ప్యాక్టరీ నిర్మాణ పనులను ఆడ్డుకుని తమ నిరసన వ్యక్తం చేశారు.. తమ భూములను ఆక్రమించుకుని ప్యాక్టరీ నిర్మిస్తున్నారని ఇదేంటని ప్రశ్నించిన తమపై నిర్వాహకులు దౌర్జన్యానికి దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పు సాగు చేసుకుంటూ ముత్తుకూరు మండలంలోని గాడిదవాగు, గోపాలపురం, చలివేంద్రం ప్రాంతాలను చెందిన దాదాపు 2000 కుటుంబాలు ఆదారపడి జీవిస్తున్నాయన్నారు.. తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పెన్నా సిమెంట్ ప్యాక్టరీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.. అనుమతులు లేని పెన్నా ప్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని వారు డిమాండ్ చేశారు..

SHARE