జగన్ నాకు దైవంతో సమానం

125

The bullet news ( Nellore)_ విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ తనకు దైవంతో సమానమని నెల్లూరు రూరల్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో 105 రోజులపాటు తన ఇంటికి వెళ్లకుండా ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మాట్లాడారు.తాను ముప్పై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, కాని తనకు ఎవరూ ఎమ్మెల్యే పదవికి అవకాశం ఇవ్వలేదని, కాని జగన్ మాత్రమే ఇచ్చారని, ఆయన తనకు దైవంతో సమానమని శ్రీధర్ రెడ్డి అన్నారు.ప్రస్తుతం పాదయాత్ర ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో తిరగాల్సి ఉందని, జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జిల్లాలో పూర్తయిన అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో పూర్తిచేస్తానని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవడం ఖాయమని స్పష్టం చేశారు.

SHARE