ప్రజలకు సేవ చెయ్యటం నా అదృష్టం – విపిఆర్ ఫౌండేషన్ అధినేత వేమిరెడ్డి..

86

THE BULLET NEWS (ATKMAKUR)-ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో మరిన్ని వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.. వీపీఆర్ ఫౌండషన్ పేరుతో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో శుద్ధ జల యంత్రాలను ఏర్పాటు చేస్తున్న ఆయన తాజాగా ఇవాళ నాలుగుచోట్ల వాటర్ ప్లాంట్స్ ను ప్రారంభించారు . ఆత్మకూరు రూరల్ మండలంలో ఎన్నవాడ, చేజర్ల మండలం ఏటూరు, అనంత సాగరం మండలంలోని సంజీవనగర్ ,సంగం మండలం కోలగట్ల గ్రామంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.. ఆయా గ్రామ ప్రజలు, నాయకులు ఆయనకి ఘాన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చెయ్యటం తన అదృష్టంగా భావిస్తు న్నానన్నారు.. ప్రజలు, గ్రామ స్థాయి నేతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు.. మరో పక్క విపిఆర్ వికాస్ పేరుతో ప్రతిభా వంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన కిట్స్ ని ఆయన పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో విపిఆర్ ఫౌండేషన్ సీఈఓ నారాయణ రెడ్డి, కో- ఆర్డినేటర్ శంకర్, సింహపురి హాస్పిటల్ అధినేత రవీంద్ర నాధ్ రెడ్డి, యువ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పాల్గొన్నారు…

SHARE