కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం నా బాధ్యత – వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా

74

The bullet news (Venkata Giri)- సాయం చేసే గుణం క‌రువ‌వుతున్న నేటి స‌మాజంలో ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటుంది ఆమె.. క‌ష్ఠాల్లో ఉన్న‌వారి క‌న్నీరు తుడ‌వ‌డంతో పాటు నేనున్నాను అనే భ‌రోసానిస్తుంది..స్పందించే మ‌న‌స్థ‌త్వం.. సాయం చేసే గుణం ఆమె స్వంతం. రాజ‌కీయాలకు అతీతంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జలకు అండ‌గా నిలుస్తోంది.. ఆమె వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా బాల‌కృష్ణ‌…

ప్రార్ధించే పెద‌వుల క‌న్నా.. సాయం చేసే చేతులుమిన్న అన్న చందాన ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ప్ర‌జ‌లు మ‌న్న‌న‌లు పొందుతున్నారు వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా.. 2014లో వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి వెంక‌ట‌గిరి రాజాలు, స్థానిక ఎమ్మెల్యే స‌హ‌కారంతో నిరుపేదలను,అబాగ్యులను ఆదుకుంటున్నారు..ఇతరులకు సాయం చేస్తే నాకేమి వస్తుంది అనుకునే ఈరోజుల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా కష్టాల్లో ఉన్నవారికి ఆమె అండగా నిలబడుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు..చదువుకునే చిన్నారుల నుంచి వృద్ధులు వరకు ప్రతి ఒక్కరికీ ఆమంటే ప్రత్యేకమైన అభిమానం…

అనారోగ్య కారణాలతో మ్రుతి చెందిన వారికి అంత్యక్రియలకు ఆర్దిక సాయం అందజేయడం, దేవాలయాల నిర్మాణానికి విరాళాలు ఇవ్వడం.. నిరుపేద విద్యార్థులను చదివించడం, మెరిట్ స్టూడెంట్స్ కి ప్రోత్సాహకాలు అందజేయడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆపన్న హస్తం అందిస్తుంటారు.. నెలనెల బియ్యం, నిత్యవసర సరుకులు సైతం అందజేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు కొన్ని వంద‌ల కుటుంబాల‌కు ఆమె ఆర్దిక సాయం చేశారు. శారదా బాలకిష్ణ చేసే సేవా కార్య‌క్ర‌మాల‌ను రాష్ట నాయకులు సైతం ప్రశంసిస్తున్నారు.. ఓ వైపు తన స్వంత డబ్బులతో మ్రుతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటూనే ప్రభుత్వం నుంచే సహాయ సహకారాలు సైతం అందజేస్తుంటారు..

తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేసేందుకు, సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు శార‌దా ఎంతగానో కృషి చేస్తున్నారు. వెంక‌ట‌గిరి రాజులు, ఎమ్మెల్యే కురుగొండ్ల స‌హాయ‌ స‌హ‌కారాల‌తోనే తానీ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు ఆమె తెలిపారు.. పట్టణ ప్రజలందరూ తనని ఇంట్లో పెద్ద కూతురిలా ఆదరిస్తున్నారని, వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటానంటారు ఆమె.. ఆమె చేసే మంచి పనుల వల్ల ప్రజల్లో ఆమెకు రోజురోజుకూ ఆదరణ పెరుగతోంది.. ఇంటి పెద్ద చనిపోతే అంత్య క్రియల నిమిత్తం రూ.3000వేలు ఆర్దిక సాయం అందజేయడం గొప్పవిషయమని పట్టణ ప్రజలు అంటున్నారు.. భవిష్యత్ లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని వారు కోరుకుంటున్నారు.

SHARE