దారిదోపిడి ముఠాను అరెస్టు చేసిన నాయుడు పేట పోలీసులు..

93

The bullet news (Naidupeta)- మొత్తం ఆరుగురు.. ఇద్ద‌రు స్కెచ్చేస్తారు.. మ‌రో న‌లుగురు దాన్ని ఫాలొ అవుతారు.. హైవేల‌పై వెళ్లే వాహ‌న‌దారుల‌ను బెదిరించి అందిన‌కాడికి దోచుకుంటారు.. ఇలా పదుల సంఖ్య‌లో దోపిడీల‌కు పాల్ప‌డ్డారు.. కేసులు సైతం న‌మోద‌య్యాయి.. చివ‌రికి వాహ‌నాల త‌నిఖీల్లో దొరికిపోయారు. న‌లుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వ‌ద్ద నుంచి ఓ కారు, 2 బైకులు, మార‌ణాయుధాలు, రూ.2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాయుడు పేట సిఐ ర‌త్త‌య్య నిందితులు చేసిన దారిదోపిడి వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

చెన్న‌య్ కు చెందిన కార్తీక్, మోహ‌న్, శ‌ర‌వ‌ణ‌న్, సురే్ష్‌లు మ‌రో ఇద్ద‌రితో క‌లిసి హైవేల పై ప్ర‌యాణం చేస్తున్న‌వారినే టార్గెట్ గా ఎంచుకున్నారు.. క‌త్తుల‌తో బెదిరించి వాహ‌న‌దారుల వ‌ద్ద‌నున్న సొమ్మును ఎత్తుకె్ళ్తూ ఉండేవారు.. 2015, 2016 సంవ‌త్స‌రంలోలో నాయుడు పేట, సూళ్లూరుపేట జాతీయ ర‌హ‌దారిపై వాహ‌న చోద‌కుల‌ను బెదిరించి వారి వ‌ద్ద నున్న మోటార్ బైక్ ను తీసుకుని పరార‌య్యారు..అనంత‌రం 2017లో చెన్న్ నుంచి నెల్లూరు వ‌స్తున్న ఐష‌ర్ లారీని వెంబ‌డించి డ్రైవ‌ర్ వ‌ద్ద నున్న 9ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఎత్తుకెళ్లారు.. దీంతో రంగంలోకి దిగిన నాయుడుపేట‌, సూళ్లూరుపేట పోలీసులు ద‌ర్యాప్తు చేపడుతున్నారు. ఇదే స‌మ‌యంలో నాయుడుపేటలో వాహన తనిఖీలు చేస్తుండ‌గా  పోలీసుల‌ను చూసి త‌మ వాహ‌నాన్ని వ‌ద‌లి పరార‌వుతున్నకార్తిక్, మోహన్, శర్వణ్, సురేష్ అనే అరెస్ట్ చేసి విచారించ‌గా దారి దోపిడి విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.. ప‌రారైన మ‌రో ఇద్ద‌రిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని సిఐ ర‌త్త‌య్య వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో దొరవారిసత్రం ఎస్సై కోటిరెడ్డి, నాయుడుపేట ఎస్సై రవినాయక్, అటెచ్డ్ ఎస్సై శ్యాంసన్, ఐడీ పార్టీ కృష్ణారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

SHARE