నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం

121

The Bullet News ( Atmakuru)-

సమయం.. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు పావుగంట తక్కువ… అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.. ఆ సమయంలోనే భారీ శబ్దాలు, పెద్ద పెద్ద మంటలు అందరిని భయబ్రాంతులకు గురి చేసాయి.. క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ఒక్కసారిగా కలకలం రేగింది..
ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని 16 వ వార్డు లో చోటు చేసుకుంది..

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో అర్ధరాత్రి వేళ క్షుద్రపూజల కలకలం రేపాయి .పట్టణంలోని పదహారువ వార్డులోని ఓ ఇంటిలో సాయంత్రం నుంచి భారీ శబ్దాలు చేస్తూ పెద్ద పెద్ద మంటలు వేస్తూ కేరళకు చెందిన వ్యక్తులు పూజలు నిర్వహించటం స్థానికులను
భయబ్రాంతులకు గురిచేసింది. ఈవిషయాన్ని కొందరు పోలీసులకు సమాచార మిచ్చారు. వెంటనె సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు .ఇంటికి శాంతి పూజ చేస్తున్నామని యజమాని చెప్పడంతో పోలీసులు వారిని వదిలేసారు.. తెల్లవారు ఝామున జరిగిన ఈసంఘటన పట్టణంలో కలకలం రేపింది .అయితే పొలీసులు ,పూజల నిర్వాహకులు వాదన మరోలా ఉంది .తమ కుమార్తెకు అనారోగ్యంగా ఉండటంతో శాంతి హోమం నిర్వహించు కుంటున్నామని.. దీనిని కొందరు క్షుద్రపూజలుగా ప్రచారం చెయ్యటం భాద కలిగిస్తుందంటున్నారు .తెల్లవారు ఝాము నుంచి పూజలు చేసుకుంటుంటే అర్థరాత్రి క్షుద్రపూజలనటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు .మొత్తానికి ఈఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది .

SHARE