చంద్ర‌బాబుపై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని

56

The bullet news (Nandyala)- ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై నేరుగా విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే వైసీపీ పైర్ బ్రాండ్గు, డివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మ‌రోసారి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఉండే విలువ‌ల‌ను చంద్రబాబు దిగ‌జారుస్తున్నార‌ని మండిప‌డ్డారు.. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత వైసీపీ ఉండదని టిడిపి నేతలు ప్రచారం చెయ్య‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు.. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ రోగిష్టి పార్టీ అని ఆయన ఘాటుగా స్పందించారు. చంద్ర‌బాబు నాయుడు అందితే జ‌ట్టు, అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకునే ర‌కమ‌న్నారు.. నంద్యాలలో ఓడిపోతామన్న భయంతోనే వందల కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు..తెలుగుదేశం పార్టీ భవిష్యత్తే అయోమయంలో పడి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఒక్క వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేక 10 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలు, కొడుకు, బావమరిదిలను రంగంలోకి దింపిన చంద్రబాబు చివరికి రిగ్గింగ్‌తో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు….

SHARE