తండ్రికి త‌గ్గ త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ – కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి

87

The bullet news (Kovuru)- తండ్రికి త‌గ్గ త‌న‌యుడికి మంత్రి నారా లోకేష్ రాజ‌కీయాల్లో అద్బుతంగా రాణిస్తున్నార‌ని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. మంత్రి నారాలోకేష్ జన్మదిన వేడుకలు ఇవాళ విడవలూరు మండల పార్టీ అధ్యక్షుడు వంశీ కృష్ణా రెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, బి.సీ. సెల్ జిల్లా అధ్యక్షులు పి.ల్. రావు, అబ్బిరెడ్డిల ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి.. ఈ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడిగా, మచ్చలేని వ్యక్తిగా నారాలోకేష్ రాజకీయాల్లో స్మార్ట్ గా రాణిస్తున్నారన్నారు..ఏపీకి ఐటీ కంపెనీలు తీసుకురావడంలో నారా లోకేష్ అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో లోకేష్ మరింతగా అభివ్రుద్ది చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులకు పండ్లు,బ్రేడ్ పంచి పెట్టి నియోజకవర్గ స్థాయిలో 5000 వేల మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు..

SHARE