వినూత్న యాప్స్ తో అబ్బుర‌ప‌రుస్తున్న నారాయ‌ణ ఇంజినీరింగ్ విద్యార్దులు

158

The bullet news (Gudur)_  ఉత్తమ శిక్షణ, అద్యాపకుల పర్యవేక్షణా వీటన్నిటితో పాటు మనస్సు పెట్టి కష్టపడితే ఏది అసాధ్యం కాదని నిరూపిస్తున్నారు నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్దులు.. టెక్నాలజిని అందిపుచ్చుకుని తమ ఆలోచనలకు అనుగుణంగా కొత్త కొత్త యాప్స్ కు రూపకల్పన చేస్తున్నారు.. ఇంటికి బయట ఉంటూ ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులపై మానిటరింగ్ చేసే యాప్ప్ ను కనిపెడుతున్నారు.. ఇవాళ గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ లో ఇంటర్ నెట్ ఆఫ్ థింక్స్ అనే అంశంపై బెంగుళూరులోని ఓ సాప్ట్ వేర్ కంపెనీ ఇచ్చిన శిక్షణను ఉపయోగించి దాదాపు 25 సాప్ట్ వేర్ లను రూపొందించారు.. టీమ్స్ గా ఏర్పడ్డ మూడొ సంవత్సరం చదువుతున్న నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్దులు సరికొత్త నమూనాలను రూపొందించారు.. ఉరుకుల పరుగుల జీవితంలో, ఆఫీసు వెళ్లే హడావుడిలో ఇంట్లో ఏసీ ఆప్ చేయడం మరిచిపో్యినా, కిచెన్ లో ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్, ఆప్ చేయాలన్నా, బయట ఉండి కూడా ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మానిటరింగ్ చేయాలన్నా తాము రూపొందించిన యాప్ ద్వారా చాలా సులభం అంటున్నారు. బెంగుళూరుకు చెందిన ఓ సాప్ట్ వేర్ సంస్థ విద్యార్దులకు మూడు రోజుల పాటు శిక్షణనిచ్చింది.. దీంతో ఇవాళ విద్యార్దులు స్వంతంగా దాదాపు 25 యాప్స్ ను తయారు చేశారు.. వారు రూపొందించిన యాప్స్ అందరిని అబ్బురపరిచాయి.. ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా మనం ఇంట్లో ఉండే వస్తువులను మానిటరింగ్ చేయొచ్చునేదే ఈ సాప్ట్ వేర్ ల సారాంశం.. సెల్ పోన్ ఆదారంగా ఇంట్లోని ఏసీని ఆన్ చేయడం, లేదా ఆప్ చేయడం, వీధి దీపాలను మానిటరింగ్ చేయడం, ఉష్ణోగ్రతను కంట్రోల్ లో ఉంచడం వంటి వాటిని మొబైల్ ద్వారా మానిటరింగ్ చేయొచ్చని వారు ప్రయోగ పూర్వకంగా వివరించారు.. ఇది ఎలా సాధ్యమని విద్యార్దుల వద్ద ఇదే విషయాన్ని విద్యార్దుల వద్ద ప్రస్తావిస్తే ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతున్న ప్రస్తుతం తరుణంలో అరచేతిలో ఉండే మొబైల్ ద్వారానే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నప్పుడు ఇంటర్ నెట్ ద్వారా పనులు ఎందుకు చేయకూడదంటున్నారు.. రాబో్యే రోజుల్లో ఈ టెక్నాలజినే ప్రపంచ దేశాలను శాసించనున్న తరుణంలో ఇప్పటి నుంచే ఇంటర్ నెట్ పై అవగాహన కల్గి ఉండటం వల్ల విద్యార్దులకు ఉపాధి అవకాశాలూ సైతం అందుబాటులో ఉంటాయంటున్నారు నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ సెక్రటరీ వై వినయ్ కుమార్ తెలిపారు..

SHARE