యూటర్న్ ఎవరి కోసం…?

127

THE BULLET NEWS (KOVUR):-

●యూటర్న్ తో ప్రమాదాలు…

●మామూళ్ల మత్తులో హైవే అధికారులు…

●పెట్రోల్ బంక్ నుంచి భారీగా ముడుపులు…

●హైవే అధికారులపై ప్రజల ఆరోపణలు…

నెల్లూరు జిల్లా కోవూరు మండలం లోని సాయి బాబా దేవాలయం సమీపంలోని జాతీయ రహదారి పై ఉన్న ఓ ప్రైవేటు పెట్రోల్ బంక్ & రెస్టారెంట్ వద్ద ఏర్పాటు ఐన యూటర్న్ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒక్కే రోజుల్లోనే ఒక్కే చోట మూడు రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘనత ఈ యూటర్న్ దే…అంతే కాకుండా ఆ ప్రదేశం లో తరుచుగా ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది… ఈ యూటర్న్ తో గతంలో హైవే అధికారుల పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి… ఆ యూటర్న్ వల్ల ప్రజల కు ఉపయోగం లేకపోగా ప్రమాదాల భారిన పడుతున్నారు..

యూటర్న్ పెట్రోల్ బంక్ కోసమేనా…?

హైవే పై ఏర్పాటు చేసిన యూటర్న్ పక్కనే ఉన్న ఓ ప్రైవేటు పెట్రోల్ బంక్ & రెస్టారెంట్ కోసమే ఏర్పాటు చేశారని పలువురు చేర్చించుకుంటున్నారు…ఈ విషయం లో పెట్రోల్ & రెస్టారెంట్ యాజమాన్యం వద్ద హైవే అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకోని యూటర్న్ ఏర్పాటు చేశారని విమర్శలు ఉన్నాయి..
గత ఏడాది అక్టోబర్ 17న వరుసగా మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి…హైవే అధికారుల నిర్లక్ష్యంగా మూడు నిండు ప్రాణాలు బలయ్యేయి. అప్పుడు హైవే అధికారుల నిర్లక్ష్యని చూపుతూ మీడియాలో పెద్ద ఎత్తున కధనాలు రావడంతో కంటి తుడుపుగా యూటర్న్ తొలగించారు.. కొద్ది రోజులొనే పెట్రోల్ బంక్ కి దారి ఇస్తూ యూటర్న్ ఏర్పాటు చేశారు.. దీంతో మరో మారు ఆ ప్రైవేటు పెట్రోల్ బంక్& రెస్టారెంట్ యాజమాన్యనికి హైవే అధికారులు అమ్ముడుపోయారనే విషయం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది… ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే కానీ సంబంధిత అధికారులు మీడియా వారు స్పందిస్తారో అన్ని ప్రజలు అంటున్నారు…

లంచాలు మత్తులో పడ్డి ప్రజల ప్రాణాలు బలి చేస్తున్నారని ప్రజలు ఆవేదన వేక్తం చేస్తున్నారు.. దీని పై హైవే అధికారులు స్పందించకుంటే తామే పోరాటం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు…

SHARE