జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం…ఒక్కరు మృతి…

223

THE BULLET NEWS (SANGAM)-నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల వద్ద జాతీయ రహదారి పై‌ జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరియర్ బాయ్ సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముత్తుకూరు గ్రామానికి చెందిన సురేష్ నెల్లూరులోని ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్నాడు.సురేష్ రోజు నెల్లూరు నుండి కొరియర్లో వచ్చిన వస్తువులను బైక్ పై ఆత్మకూరుకు తీసుకుని వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈ రోజు డెలివరీ ఇచ్చేందుకు వస్తుండగా మార్గ మధ్యలో సంగం మండలం కోలగట్ల వద్ద ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్ గల లారీ బైక్ ను ఢీకొంది.లారీ ఆపకుండానే అక్కడ నుండి లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.అతి వేగం లారీ బైక్ ను డీకొనడంతో బైక్ లో మంటలు వ్యాపించాయి.దీంతో బైక్ మంటల్లో పూర్తిగా ధగ్దం అయింది.

SHARE