నెల్లూరు అపోలో హాస్ప‌ట‌ల్ లో జాతీయ స్థాయి న్యూరాల‌జీ స‌ద‌స్సు

87

The bullet news (Nellore)_ నెల్లూరులో జాతీయ స్థాయి న్యూరాల‌జీ స‌ద‌స్సుజ‌రిగింది. అపోలో హాస్పిట‌ల్ న్యూరాల‌జి విభాగాధిప‌తి, న్యూరాల‌జి సీనియ‌ర్ క‌న్సెల్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ బిందు మీన‌న్ ఆద్వ‌ర్యంలో జ‌రిగిన ఈ నాల్గ‌వ జాతీయ‌ స్థాయి న్యూరాల‌జీ స‌మావేశానికి దేశ‌వ్యాప్తంగా 250 మంది ప్ర‌తినిధులు, 20 మంది స్పీక‌ర్లు, ది ఇండియ‌న్ అకాడ‌మి ఆఫ్ న్యూరాల‌జీ అధ్యక్షుడు, కార్య‌ద‌ర్శి విచ్చేశారు. న్యూరాల‌జి 4వ జాతీయ స్థాయి స‌ద‌స్సుకు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎమ్‌.డి ఇంతియాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న డాక్ట‌ర్ బిందు మీన‌న్ ర‌చించిన న్యూరో సైన్స్ – అక్రాస్‌ది ఏజెస్‌ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం న్యూరాల‌జీకి సంబంధించి ఎంతో విజ్ఞానాన్ని పంచుతూ స‌రికొత్త విష‌యాల‌ను తెలియ‌జేసే ఈ పుస్త‌కాన్ని డాక్ట‌ర్ బిందుమీన‌న్ రూపొందించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. అనంత‌రం ఈ స‌ద‌స్సులో న్యూరాల‌జికి సంబంధించిన నూతన వైద్య‌విధానాలు, వ్యాధుల‌పై చ‌ర్చ జ‌రిగింది. ఈ జాతీయ స్థాయి న్యూరాల‌జీ స‌ద‌స్సులో అపోలో హాస్పిట‌ల్ న్యూరాల‌జి విభాగాధిప‌తి ప్రొఫెస‌ర్‌, డాక్ట‌ర్ బిందుమీన‌న్ మాట్లాడుతూ ఈ ఏడాది 4వ జాతీయ స్థాయి కాన్ఫ్‌రెన్స్‌ను నిర్వ‌హించామ‌ని, ఈ కాన్ఫ్‌రెన్స్‌లో నూత‌నంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్ట్రోక్ అండ్ ఇంట్రవెన్షన్ వ‌ర్క్‌షాపు నిర్వ‌హించామ‌ని ఆమె తెలిపారు. ఈ జాతీయ స్థాయి స‌ద‌స్సులో ఆంద్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ కౌన్సిల్ వారు నాలుగు క్రెడిట్ అవ‌ర్స్‌ను ఇవ్వ‌గా డాక్ట‌ర్ అశోక్‌గారు పర్య‌వేక్ష‌కులుగా వ్య‌వ‌హ‌రించారు.ఈ కార్యక్రమంలోఅపోలో ఆసుపత్రి యూనిట్ హెడ్ నవీన్, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ శ్వేతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SHARE