నేడు వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు

87

The Bullet news (Nellore)- నేడు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు విశాఖ జిల్లా పెందుర్తిలో రామ్ కుమార్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాంకుమార్ రెడ్డికి పార్టీ కండువా కప్పనున్నారు. ఈ నేపథ్యంలో రామ్ కుమార్ రెడ్డి అనుచరులు, జిల్లా వైసీపీ నేతలు ఇప్పటికే పెందుర్తికి చేరుకున్నారు.

నేదురుమల్లి ఆత్మీయ సమావేశంలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప‍్రకటించారు. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు వెళ్లి జగన్‌ ని కలిసిన సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో వెంక‌ట‌గిరి ఎమ్మెల్యేగా లేదంటే విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది. అయితే ఆనం రాంనారాయ‌ణ రెడ్డికి వెంక‌టిగిరి టికెట్ పై జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో వెంక‌టిగిరి టికెట్ పై ఆసక్తి నెలకొంది

SHARE