నెల్లూరు జిల్లా కమలంలో కొనసాగుతున్న వర్గ పోరు…

108

THE BULLET NEWS (KOVUR)-నెల్లూరు జిల్లా బిజేపీలో వ‌ర్గ‌పోరు కొన‌సాగుతోంది.. జిల్లా అద్య‌క్షులు సురేంద్ర రెడ్డి వ‌ర్గం, రాష్ట ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్ రెడ్డి వ‌ర్గాలు ఎవ‌రికి వారుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.. ఇవాళ కోవూరులో రాష్ట ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన కార్య‌క్రమంలో ఈ వ‌ర్గ‌పోరు స్ప‌ష్టంగా క‌నిపించింది.. కోవూరుకు చెందిన బిజెపి మండల పార్టీ క్యాడ‌ర్ కు స‌మాచారం అందించ‌కుండానే స్వ‌యంగా సురేష్ రెడ్డి ఆయ‌న ఫాలోవ‌ర్స్ రంగంలోకి దిగి కోవూరు బస్టాండ్ సెంట‌ర్ నుంచి ఎమ్మార్వో కార్యాల‌యం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు.. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుతూ దేశాభివృద్ది కోసం నిరంత‌రం కృషి చేస్తున్న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, రాష్ట‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ల చిత్ర‌ప‌టాలు ప్ర‌తి ప్ర‌భుత్వ మండ‌ల కార్యాల‌యాల్లో ఏర్పాటు చేయాల‌ని బిజేపీ రాష్ట ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌న్న‌పురెడ్డి సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఈ సంద‌ర్భంగా సురేష్ రెడ్డి కోవూరు ఎమ్మార్వో రామ‌లింగేశ్వ‌ర్ రావుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, రాష్ట‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ల చిత్ర‌ప‌టాలు అంద‌జేశారు..

SHARE