దొంగ అరెస్ట్… 5 లక్షలు విలువ చేసే బంగారం, బైక్ స్వాధీనం…

147

THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు సీసీఎస్ పోలీసులు మంచి పని తీరును కనబరుస్తున్నారు.. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిపై నిఘా ఉంచుతూ వారిని చెరసాలకు పంపుతున్నారు.. దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వారిని పట్టుకుంటున్నారు. జిల్లాలోని వెంకటగిరిలో 2015 లో జరిగిన రెండు చోరీ కేసులో చంద్ర శేఖర్ అనే నిందితున్ని అరెస్ట్ చేశారు.. అతని వద్ద నుంచి సుమారు 5 లక్షలు విలువ చేసే బంగారు, బైక్ ను స్వాదినం చేసుకున్నారు.. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న చంద్రశేఖర్ వెంకటగిరిలోని ఎపిటీఫ్ కాలనీ లో ఓ ఇంట్లోకి చొరబడి నగలు ఎత్తుకెళ్లాడు.. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో చంద్రశేఖర్ నగరంలో సెంచరిస్తుండగా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో బండారం బయటపడింది.

బైట్..
1. బాల సుందర్ రావు.. సీసీఎస్ డిఎస్పీ

SHARE