రొట్టె ప‌ట్టిన సిటి ఎమ్మెల్యే అనిల్…

47

The bullet news (Nellore)_ రొట్టెల పండుగ సందర్భంగా బారాషాహిద్ దర్గా లో నెల్లూరు సిటి ఎమ్మెల్యే డాక్ట‌ర్ అనిల్ కుమార్ యాద‌వ్ ప్ర‌త్యేక ప్రార్ద‌న‌లు నిర్వ‌హించారు. నెల్లూరు నగర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అలాగే ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం నిరంత‌రం ప్ర‌జ‌ల్లో తిరుగుతున్న వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అవ్వాల‌ని ఆయ‌న రొట్టె ప‌ట్టుకున్నారు.. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో డెంగ్యూ జ్వ‌రాలు విజృంభిస్తున్నాయ‌ని, అధికారులు ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.. డెంగ్యూ బారిన ప్ర‌జ‌లు ప‌డ‌కుండా ఆరోగ్యం ఉండాల‌ని ఆయ‌న కోరారు.. అలాగే వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అవ్వాల‌ని, వైఎస్సార్ పాల‌న‌ను ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని ఆయ‌న తెలిపారు.. ఈ కార్యక్ర‌మంలో మైనార్టీ నాయ‌కులు, వైసీపీ నేత‌లు పాల్గొన్నారు..

SHARE