నెల్లూరు జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు- సైకో కిల్ల‌ర్ వెంక‌టేశ్వ‌ర్లుకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు

141

The bullet news (Nellore)- ఇంట్లోకి ప్ర‌వేశించి న‌లుగురిని దారుణంగా హ‌త‌మార్చాడు.. అందిన కాడికి దోచుకుపోయాడు.. మ‌రెంద‌రినో భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశాడు.. మ‌రికొంద‌రిని గాయ‌ప‌రిచాడు.. ఇలా రెండేళ్ల పాటు సామాన్యుల‌కు ముచ్చెమ‌టలు ప‌ట్టించిన సైకో కి్ల‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు కేసులో నెల్లూరుజిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది.. మంచినీళ్లు తాగినంత ఈజీగా మ‌నుషుల ప్రాణాల‌ను బ‌లితీసుకున్న సైకో కు మ‌ర‌ణ శిక్ష విధించింది.. గ‌తేడాది సెప్టెంబ‌ర్ లో నెల్లూరు న‌గ‌రంలోని చిల్డ్ర‌న్స్ పార్కు స‌మీపంలో ఓ ఉపాద్యాయురాలిని హ‌త‌మార్చి అడ్డొచ్చిన కూతుర్ని దారుణఃగా సుత్తి కొట్టాడు.. అంత‌కుముందు నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లీపురం స‌మీపంలోని ఓ వ్రుద్ద పూజారి దంపతులను, అంతకుముందు కావలిలో ఓ మహిళను దారుణంగా తలపై మోది హతమార్చారు.. అప్పట్లో ఈ హత్యలు సంచలనం స్రుష్టించాయి..ఈ కేసుల్లో అత‌నికి నెల్లూరు జిల్లా కోర్టు ఉరి శిక్ష విధించింది..

SHARE