THE BULLET NEWS (KOVUR)-నెల్లూరు జిల్లా లో మరోసారి బైట పడిన ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపు నొప్పి తో హాస్పిటల్ లో చేరిన నిర్మల అనే మహిళకు కడుపులో  గుడ్డ ను మరిచిపోయారు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది

2015 లో  విడవలూరు మండలం వావిళ్ల కు చెందిన మన్యం నిర్మల అనే మహిళకు కడుపులో  గర్భసంచికి సంభందించిన ఆపరేషన్ ను ను నిర్వహించారు..అయితే ఆపరేషన్ చేసే క్రమంలో భాదితురాలి కడుపులొ గుడ్డ పెట్టి ఆపరేషన్ చేసి గుడ్డ ను మరిచిపోయారు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది

ఆపరేషన్ చేసిన రోజు నుంచి సుమారు మూడు సంవత్సరాల గా భాదితురాలు నిర్మల  కడుపు నొప్పి తో బాధపడుతూ ఉంది. ఇది గమనించిన నిర్మల బంధువులు  కోవూరు ప్రభుత్వ హాస్పిటల్  చికిత్స చేయించగా క డుపు లో గుడ్డను గుర్తించి  వెలికితీయుంచడంతో .నిర్మల ప్రాణాపాయం నుండి బైట పడింది.

SHARE