The bullet news ( నెల్లూరు ) -:

కార్మికుల సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యం

బాధిత కుటుంబానికి రూ. 10లక్షల నష్టపరిహారం అందజేసిన నగర మేయరు అబ్దుల్ అజీజ్

తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో నగర పాలక సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నామని మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన పారిశుధ్య కార్మికుడు గుర్రాల పుల్లయ్య కుటుంబానికి నష్ట పరిహారం పది లక్షల రూపాయల చెక్కును మేయరు బుధవారం అందజేశారు. కార్పొరేషనులోని మేయరు కార్యాలయములో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో భాగంగా జూన్ నెల 9వ తేదీన విఆర్ సి కూడలిలో విధులు నిర్వర్తిస్తుండిన పుల్లయ్య గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో సంఘటనా స్థలిలోనే మృతిచెందాడని వెల్లడించారు. మృతునికి భార్యా, ఇద్దరు కుమారులు, అవివాహితైన కుమార్తె ఉన్నారనీ, అందజేసిన పరిహారం వారి కుటుంబానికి ఎంతగానో ఆధారమవుతుందని మేయరు తెలిపారు. రాష్ట్రంలోని ఏ కార్పొరేషనూ చేపట్టని కార్మిక సంక్షేమ పధకాలను నెల్లూరు నగర పాలక సంస్థలో అమలుచేస్తూ కార్మికుల అభ్యున్నతికి అనునిత్యం పాటుపడుతున్నామని మేయరు వెల్లడించారు. పరిహారంతో పాటుగా కుటుంబ సభ్యులకు కార్పొరేషనులో ఉద్యోగం కల్పించనున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పిట్టి సత్య నాగేశ్వర్ రావు, ప్రశాంత్ కుమార్, హెల్త్ విభాగం అధికారులు శ్రీనివాసులు, సుహాసిని, మృతుని భార్య రమణమ్మ, కుమార్తె శాంతి తదితరులు పాల్గొన్నారు..

SHARE