పీపుల్స్ పార్క్ లో జిమ్ ను స్టార్ట్ చేసిన మేయర్

81

The Bullet News – Nellore

దేశంలోని మెట్రో నగరాల పార్కులకు దీటుగా అత్యంత సుందరంగా నగరంలోని అన్ని పార్కులను తీర్చిదిద్దుతున్నామని మేయరు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. స్థానిక హరనాధపురంలోని పీపుల్స్ పార్కులో నూతనంగా ఏర్పాటుచేసిన జిమ్ పరికరాలను మేయరు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పార్కును అభివృద్ధి చేశామనీ, ప్రస్తుతం పది రకాల వ్యాయామ పరికరాలను నూతనంగా అమర్చామని తెలిపారు. వాకింగ్ ట్రాకు, జిమ్ పరికరాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఇదేవిధంగా నగరంలోని 25 ప్రధాన పార్కులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి విచ్చేసే సందర్శకులకు యోగా, వ్యాయామం, ఆట పరికరాలు వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ప్రజలంతా అసోసియేషనులుగా ఏర్పడి తమ స్థానిక పార్కులను సంరక్షించుకుంటూ, పార్కుల నిర్వహణా బాధ్యతలను పర్యవేక్షించాలని మేయరు కోరారు. నగరంలోని జనావాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల వివరాలను సేకరించి మరో వంద పార్కుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్కు అసోసియేషను కమిటీ సభ్యులు చిన్నయ్య, అనిల్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, రషీదు, శంకరయ్య, ఈశ్వర రెడ్డి, తిరుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు..

SHARE