ధాన్యానికి మద్దతు ధర రికార్డు స్థాయిలో ఇస్తున్నాం… – మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

99

THE BULLET NEWS (NELLORE)-జిల్లా టీడీపీ పార్టీ ఆఫీసు లో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సీజేఎఫ్ఎస్ ను రద్దు చేసి దాని పరిధిలోని 95 వేల ఎకరాలను లబ్ధిదారుల వారసులైన 65 వేల దళిత, గిరిజన రైతు కుటుంబాలకు డిఫార్మ్ పట్టా కింద ఇవ్వనున్నాం.ఈ మేరకు క్యాబినెట్ లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం.వారసులుగా ఆ భూమిని ఎవరైతే సాగుచేసుకుంటున్నారో వారి పేర్లు అడంగళ్, 1బీలో నమోదు చేయడంతో పాటు పాసుపుస్తకాలు జారీ చేసి అన్ని భూయాజమాన్య హక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.ఈ నిర్ణయం ద్వారా జిల్లాలోని దళిత, గిరిజన వర్గాల రైతులు లబ్ధి పొందుతారు.మొత్తంగా 2.60 లక్షల మంది రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది.జిల్లాలోని దళిత, గిరిజన కుటుంబాల తరఫున సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు.జిల్లాకు ఈ ఏడాది 22 టీఎంసీ ల కృష్ణా జలాలను తీసుకువచ్చాము. వీటి వల్ల భూగర్భ జలాలు అభివృద్ధి చెంది రైతులకు లబ్ది చేకూరింది.టీడీపీ తీసుకున్న నిర్ణయాలతోనే జిల్లా సస్యశామలంగా ఉంది.ధాన్యానికి మద్దతు ధర రికార్డు స్థాయిలో ఇస్తున్నాం.జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 2 లక్షల పుట్ల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశాం.కేంద్రం ఏపీలో 56వేల టన్నుల కందులు కొనుగోలు చేయమంటే లక్ష టన్నులు కొనుగోలు చేసాం..ప్రధాని మోదీ అనాలోచితంగా తీసుకున్న జీఎస్టీ అమలు, నోట్ల రద్దు వల్లే పంటల ధరలు ఘోరంగా పడిపోయాయి.మోడీ నియంతృత్వ నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు, ఈ విషయంలో బీజేపీని వైసీపీ నిలదీయాలి.బీజేపీ రాష్ట్రాల్లో ఒక రూలు, ఇతర రాష్ట్రాల్లో మరో రూలు తీసుకువచ్చి రైతులను ముంచుతున్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 90 శాతం పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంటే మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం 40 శాతం పంటను కూడా కొనుగోలు చేయడం లేదు.ఇప్పటివరకు 17వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. బిందు, తుంపర్ల సేద్యంలో గుజరాత్ ను పక్కకు నెట్టి ఏపీని మొదటిస్థానంలో తీసుకువచ్చాం.వ్యవసాయం విషయంలో గత ప్రభుత్వాలు పదేళ్లలో వెచ్చించిన నిధులకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ మా ప్రభుత్వం వెచ్చిస్తోంది.ఏ పథకంలోనూ దళారుల ప్రమేయం లేకుండా ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా నిధులు ఖర్చుపెడుతున్నాం.
అకాలవర్షాలతో మార్చి, ఏప్రిల్ లో రైతులకు 102కోట్ల నష్టం వచ్చింది, వారిని అదుకునేందుకు చర్యలు చేపట్టాం.వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతలకు లేదు అన్ని అన్నారు.

SHARE