రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పై కేసు.. బిగుస్తున్న బెట్టింగ్ ఉచ్చు…

136

THE BULLET NEWS (NELLORE)-వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. క్రికెట్ బుకీలతో సంబంధాలున్నాయంటూ ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… కొందరు క్రిమినల్స్ నుంచి లక్షల రూపాయలు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారంటూ పోలీస్ శాఖ పంపిన నివేదిక ఆధారంగా ఏసీబీ కేసులు నమోదు చేసింది.శ్రీధర్‌ రెడ్డికి క్రికెట్ బుకీలతో సంబంధాలపై ఇటీవల నెల్లూరు ఎస్పీ రామకృష్ణ…. డీజీపీ మాలకొండయ్యకు ఒక నివేదిక పంపారు. దాన్ని పరిశీలించిన డీజీపీ….  సమగ్ర దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌కు లేఖ రాశారు. దీంతో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది.
కోటంరెడ్డితో తనకు పదేళ్లుగా పరిచయం ఉందని…. 2009, 2014 ఎన్నికల్లో రూ.5 లక్షల చొప్పున ఫండ్‌ ఇచ్చానని బుకీ కృష్ణసింగ్‌ పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది.కోటం రెడ్డి సాయంతోనే తాను టాప్ బుకీగా ఎదిగానని కృష్ణ సింగ్ చెప్పినట్టు పోలీసు వర్గాలు వివరిస్తున్నాయి.  ఈ విషయాలను నిర్ధారించుకోవడానికి విచారణకు రావాలని ఎమ్మెల్యేకు నోటీసు ఇచ్చినా రాలేదని నెల్లూరు ఎస్పీ నివేదికలో డీజీపీకి వివరించారు.

SHARE