సంత‌పేట‌లో కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. త‌ప్పిన ముప్పు

148

The Bullet News – Nellore

నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నం అక‌స్మాత్తుగా కూలిపోయింది.. దాని వ‌ద్ద ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంలో ఘోర ప్ర‌మాద‌మే త‌ప్పింది.. ఈ ఘ‌ట‌న నెల్లూరు న‌గ‌రంలోని సంత‌పేట వ‌ద్ద చోటు చేసుకుంది.. సంత‌పేట వ‌ద్ద‌నున్న పాత చేప‌ల మార్కెట్ వ‌ద్ద మంత్రి నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో నూత‌నంగా చేప‌ల మార్కెట్ నిర్మాణానికి పనులు జ‌రుగుతున్నాయి.. ఇవాళ ఉద‌యం అక‌స్మాత్తుగా నిర్మాణంలో ఉన్న స్లాబ్ సెంట్రింగ్ కూలిపోయింది.. బేస్మెంట్ సరిలేక పోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్లాబ్ కూలే స‌మ‌యంలో అక్క‌డ ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాద‌మే త‌ప్పింద‌ని స్థానికులు అంటున్నారు. హడావుడిగా నిర్మాణం చేప‌ట్ట‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు ఆందోల‌న నిర్వ‌హిస్తున్నారు. మంత్రి నారాయణ కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు.. దీంతో అక్క‌డ స్వ‌ల్ప ఉద్రిక‌త్త‌త చోటు చేసుకుంది..

SHARE