బ్యూటిఫికేష‌న్ దిశ‌గా నెల్లూరు న‌గ‌రం

59

The bullet news (Nellore)- రాష్టంలోని 110 మునిసిపాల్టీల‌ను సుంద‌రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాష్ట మునిసిప‌ల్ శాఖామంత్రి పొంగూరు నారాయ‌ణ తెలిపారు.. నెల్లూరులోని టీడీపీ కార్యాల‌య స‌మీపంలోని డివైడ‌ర్లు మ‌ధ్య‌లో ఉన్న మొక్క‌ల‌ను ఆయ‌న ట్రిమ్ చేశారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట‌వ్యాప్తంగా అన్ని మునిసిపాల్టీల్లో బ్యూటిఫికేష‌న్ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.. గ‌త ఆరునెల‌ల నుంచి ఇదే వ్య‌వ‌హారంపై దృష్టి పెట్టామ‌న్నారు.. జ‌న‌వ‌రి క‌ల్లా నెల్లూరు న‌గ‌రంతో పాటు రాష్టంలోని మునిసిపాల్టీల‌ను సుంద‌రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు.. ముఖ్యంగా నెల్లూరు న‌గ‌రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు అన్ని ప‌నులు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు.. అంత‌కుముందు డివైడ‌ర్ల మ‌ధ్య‌లో ఉన్న మొక్క‌ల‌ను నూడా చైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, న‌గ‌ర క‌మిష‌న‌ర్ ఢిల్లీరావుతో క‌లిసి ట్రిమ్ చేశారు..

SHARE