THE BULLET NEWS (KODAVALUR)-నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాళెంలోని విశ్వజననీ బాలల ఆశ్రమంలో నేస్తం హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఆశ్రమంలోని  పిల్లల బాగోగులకు 8 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేత.ఆశ్రమంలోని పిల్లలకు అల్పాహార విందు,పండ్లు  ఏర్పాటు చేశారు.ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ నేస్తం హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి మొదటి కార్యక్రమం మా ఆశ్రమంలో జరుపుకుంటున్నందుకు  సంతోషం వ్యక్తం చేశారు.విద్యార్థులుగా ఉన్న  వారు అనాథ బాలలకు సహాయం చేయడం అభినందనీయం.వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఎంతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము.ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు రోహిత్, విష్ణు,విశ్వజనని ఆశ్రమ నిర్వాహకులు సాగర్ పాల్గొన్నారు

SHARE