కొత్త‌కొడూరు బీచ్ లో విషాదం.. – ఈతకెళ్లి ముగ్గురు యువ‌కులు మృతి

203

The bullet news (T.P Gudur)_  ఆహ్లాదం కోసం ఈతకెళ్లిన వెళ్లిన వారిని అల‌లు పొట్ట‌న‌పెట్టుకున్నాయి.. ముగ్గురు యువ‌కుల‌ను స‌ముద్రం మింగేసింది.. ఈ విషాద ఘ‌ట‌న నెల్లూరుజిల్లా టిపి గూడూరు మండలం కోడూరు బీచ్ లో చోటు చేసుకుంది.. కొమ్మలపూడి గ్రామానికి చెందిన దాదాపు 19 మంది కోడూరు బీచ్ కు వెళ్లారు.. అంద‌రూ స‌ర‌దాగా ఈతాడుతున్న స‌మ‌యంలో రాకాసి అల ఐదుగురి మీద విరుచుకుప‌డింది.. వారిలో ఇద్ద‌రు త‌ప్పించుకోగా మ‌రో ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు.. మృతిచెందిన వారు పెనబల్లి యశ్వంత్(26) పెనుబల్లి దిలీప్(24) బిరిజేపు వెంకటేష్(23) లుగా పోలీసులు గుర్తించారు..ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు చ‌నిపోవ‌డంతో ఆ కుటుంబ సభ్యులు గుండెలు ప‌గిలేలా రోదిస్తున్నారు..

SHARE