నెల్లూరుజిల్లాలో ‘చెత్త’ పంచాయతీ

200

THE BULLET NEWS (MUTHUKUR)- నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముత్తుకూరు పంచాయతీ పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ అధికారులు. జిల్లాలో అధిక కంపెనీలు,కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉన్నప్పటికీ జనావాసాలు ఎక్కువగా ఈ పంచాయతీలో నివసిస్తూ ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు స్పందించకుండా కార్యాలయంలో కూడా ఉండకుండా పారిశుధ్యంపై నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు. ఇంటి పన్నులు,జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు ఇతరత్రా పన్ను రాబడి విషయాల్లో మాత్రం త్వరితగతిన పనిచేసి వసూలు చేసుకుంటున్నారు. కానీ కార్యాలయం సమీపంలో ఉన్న కాలువలను కూడా శుభ్రం చేయకుండా చోద్యం చూస్తున్నారు. మండల కేంద్రాలు,పంచాయతీ కార్యాలయం సమీపంలో గల ప్రాంతాలను కూడా శుభ్రపరచి అధికారులు ఇంకా వారి కార్యాలయాలు ఏమాత్రం శుభ్రంగా ఉంచుకున్నారు తెలియదు.పంచాయతీ పరిధిలో ఎక్కడ చూసినా పందులు,కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాలువల్లో ప్రవహించాల్సిన మురుగునీరు కాల్వలు శుభ్రపర్చిన కారణంగా రోడ్లపై ప్రవహిస్తున్నాయి. ప్రధాన కూడలి వద్ద వ్యాపారం చేసుకునే వారికి కూడా ఈ మురుగునీరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పంచాయతీ అధికారుల కోసం ప్రజలు వేచి ఉండాల్సి వస్తుంది.కార్యాలయాల్లో ఉండరు,ఫోన్లకు కూడా అందుబాటులో ఉండని ఈ పంచాయతీ అధికారులు పంచాయతీని ఏ మాత్రం అభివృద్ధి చేస్తారో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా పంచాయతీ అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముత్తుకూరు పంచాయతీని శుభ్రపరచాలని ప్రజలు కోరుకుంటున్నారు.

SHARE